రంజాన్ పండుగ‌పై మంత్రి త‌ల‌సాని సమీక్ష

TS Minister Talasani Srinivasa Yadav
TS Minister Talasani Srinivasa Yadav

హైదరాబాద్: నేడు డీఎస్ఎస్ భవన్ లో మంత్రులు మహమ్మద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ ,కొప్పుల ఈశ్వర్ లు వచ్చే నెల 3 వ తేదీన ప్రారంభమయ్యే రంజాన్ పండుగ పై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సమీక్షా సమావేశానికి టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు , మైనార్టీ శాఖ అధికారులు , సీపీ సీవీ ఆనంద్ లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగకు ప్రభుత్వం పరంగా అని ఏర్పాట్లు సిద్ధం చేశామని స్పష్టం చేసారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి సంవత్సరం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకునేలాగా ఏర్పాట్లు చేస్తూ వచ్చామని తెలిపారు. పేదలకు సైతం రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సీఎం కెసిఆర్ ఉద్దేశం మేరకు కొత్త బట్టలు, గిఫ్ట్ లు పంచుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/