ఈడీ ఆఫీస్ కు మంత్రి తలసాని పీఏ

క్యాసినో, హవాలా, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి తెలంగాణలో కొన్ని రోజులుగా ఈడీ, ఐటీ శాఖల అధికారులు తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు టీఆర్ఎస్ నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు జరపడం జరిగింది. రీసెంట్ గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారించగా , ఈరోజు ఈడీ ముందుకు డిసిసిబి చైర్మన్ దేవేంధర్ రెడ్డి, తలసాని పిఏ హరీష్ తో పాటు మరికొందరు వ్యాపారులను సైతం హాజరుకానున్నారు.

అటు ఇప్పటికే విచారణ కు హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ..విచారణ మద్యలో అనారోగ్యం పాలైన ఎల్ రమణ, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన పై ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. హవాలా నగదు చెల్లింపు లపై ఈడీ ఆరా తీస్తున్నారు. ఈ నేథ్యంలోనే ఈరోజు ఈడీ ఆఫీస్ కు మంత్రి తలసాని పీఏ వెళ్లనున్నారు.