గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ నియోజవర్గంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టి, నాణ్యమైన విద్యను, భోజనాన్ని విద్యార్థులకు అందిస్తూ.. ఒక్క విద్యార్థి పై లక్ష రూపాయలు కేటాయిస్తున్నా ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, సీరోలు గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాల్లో నిన్న ఫుడ్ పాయిజన్ అయి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి ఐన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే మంత్రి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆ విద్యార్థులకు వెంటనే వైద్య సేవలు అందిచడం వల్ల అందరు బాగున్నారు. మరో 14 మంది విద్యార్థులు నీరసంగా ఉండడం వల్ల వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి వారికీ వైద్యం అందిస్తున్నాము, పిల్లల తలిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు అని సత్యవతి రాథోడ్ చెప్పారు.


కాగా, గురుకులం పరిసరాలను పరిశీలించడంతో పాటు.. సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, గురుకులం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ గురుకులంలో టిఫిన్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/