మంత్రి రోజా ఎటు వెళ్లొచ్చిన దిష్టి తీయడం తప్పనిసరి

మంత్రి రోజా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాల్లో నటించేటప్పుడే కాదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత కూడా రోజా పేరు వార్తల్లో హైలైట్ అవుతుంటుంది. ముఖ్యంగా రోజా ఏ పార్టీ లో ఉన్న అవతలి పార్టీ ఫై ఫైర్ అవ్వడం ఆమెకు అలవాటు. అందుకే ఆమెకు ఫైరింగ్ రోజా అని పిలుస్తుంటారు. ప్రస్తుతం వైస్సార్సీపీ లో మంత్రి గా కొనసాగుతున్న ఆమెకు ప్రతి రోజు దిష్టి తీయడం అనేది చేస్తుంటారట కుటుంబ సభ్యులు.

రోజా కాస్త అందరికంటే ఎక్కువ మాట్లాడుతుంటుంది. ముఖ్యంగా ప్రత్యర్థుల ఫై విరుచుకపడుతుంటుంది. అందుకే ఆమెకు ఎక్కువ మంది శత్రువులు ఉంటారు. బయట పార్టీలోనే కాదు సొంత పార్టీ లోను ఆమెకు ప్రత్యర్ధులు ఉన్నారు. అందుకే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మాత్రమే కాదు విపక్ష పార్టీల దిష్టి ఆమెకు తగులుతుందని..కుటుంబ సభ్యులు ఆమె క్షేమం కోరుతూ ఎప్పుడు బయటకు వెళ్లి ఇంటికి వచ్చినా దిష్టి తీస్తారట. దీన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త తెలిసి అంత అవునా అని షాక్ అవుతున్నారు.