సీఎం జగన్ కు ర‌ఘురామ మరో లేఖ‌

పీసీఏ చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమించ‌డంపై లేఖ‌

అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. ఏపీలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన‌ రాష్ట్ర ప్రభుత్వం దానికి చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమిస్తూ ఇటీవ‌లే ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విషయం పై కృష్ణరాజు స్పందిస్తూ సీఎం లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరిట ఆయ‌న ఈ లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమించడం స‌రికాద‌ని చెప్పారు.

నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వ‌య‌సులోపు ఉన్నవారు పీసీఏ చైర్మన్‌ పదవికి అర్హులని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌ చేసేందుకే నిబంధన 4(ఏ)ను సవరించారని ఆయ‌న చెప్పారు. ప్రజల్లో జ‌గ‌న్ ఇమేజ్ పలుచన కాకూడదని ఆయ‌న చెప్పారు. అందుకే తనలాంటి వారు ఆయ‌న‌కు ఇలాంటి అభిప్రాయాలు చెబుతున్నార‌ని పేర్కొన్నారు. ఏపీలో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ చైర్మ‌న్ విష‌యంలో జ‌గ‌న్ మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయ‌న కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/