సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేల ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ కు గురైన నేతలు మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరియన్ బుద్ది చెపుతారని అంటున్నారు. మరోపక్క వరుస పెట్టి వైస్సార్సీపీ నేతలు ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫై విమర్శలు , మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా దమ్ముంటే..ఈ నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి..తమకు నచ్చిన పార్టీ లో నిల్చుని పోటీ చేయాలనీ సవాల్ విసిరారు..

‘కరోనా సమయంలో ఉండవల్లి శ్రీదేవి కోసం స్పెషల్ ఫ్లైట్‌ ఏర్పాటు చేసి సీఎం జగన్ ప్రాణాలు కాపాడితే.. ఆయన నుంచే ప్రాణహాని ఉందని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోంది. హైదరాబాద్‌లో ఉండే డాక్టర్‌ను తీసుకొచ్చి అమరావతిలో గెలిపిస్తే.. ఈరోజు పార్టీకి ద్రోహం చేసింది. ఎంత పెద్ద డాక్టర్‌ అయినా.. ఎంత సీనియర్‌ లీడర్‌ అయినా సరే.. ఎన్నికల్లో జగన్‌ వల్లే గెలుపొందార‌నే విషయం గుర్తుంచుకోవాలి’ అని రోజా శ్రీదేవి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.