నా జీవితాంతం టీఆర్ఎస్ లోనే : ఎమ్మెల్యే రాజ‌య్య‌

నేను లోటస్‌పాండ్‌కు పోలేదు..ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య

హైదరాబాద్: లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల భ‌ర్త అనిల్ కుమార్‌ను క‌లిసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు వాస్త‌వం కాద‌ని ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడారు. తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని, అసలు బ్రదర్ అనిల్ ను తాను కలవలేదని చెప్పారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దని కోరారు.

పాత ఫొటోలను ఉపయోగిస్తూ తాను పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో మనసును గాయపరచొద్దని అన్నారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని… మండ‌లిలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో తాను టీఆర్ఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాను.  తాను జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటానని అన్నారు. ఇవాళ ద‌ళితులు త‌లెత్తుకుని తిరిగే విధంగా ద‌ళిత బంధు కార్య‌క్ర‌మాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టారు అని తాటికొండ రాజ‌య్య ప్ర‌శంసించారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/