లడఖ్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష సమవేశం

సమావేశంలో పాల్గొన్న త్రివిధ దళాధిపతులు

లడఖ్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష సమవేశం
Defence Minister Rajnath Singh reviews situation in eastern Ladakh

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై వీరితో సమీక్ష నిర్వహించారు. గాల్వ‌న్ లోయ నుంచి ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి జ‌న‌ర‌ల్ న‌ర‌వాణే.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌కు స‌వివ‌రంగా విష‌యాల‌ను వెల్ల‌డించారు. గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌, ఫింగ‌ర్ 4, పాన్‌గాంగ్ సో లాంటి కీల‌క ప్రాంతాల నుంచి కూడా ద‌ళాలు వెన‌క్కి వెళ్లిన‌ట్లు జ‌న‌ర‌ల్ న‌ర‌వాణే తెలిపారు. గాల్వ‌న్ లోయ‌లో మూడు కిలోమీట‌ర్ల మేర బ‌ఫ‌ర్ జోన్‌ను క్రియేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ నరవాణే, నేవీ చీఫ్ కరంవీర్ సింగ్, వాయుసేన చీఫ్ బధూరియాతో పాటు సీనియర్లు హాజరయ్యారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/