నేడు జాతినుద్దేశించి ప్రధాని మోడి ప్రసంగం

ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగం

Thanks to people _ Modi Tweet
PM MODI

న్యూఢిల్లీ: కరోనా‌ మూడోదశ లాక్‌డౌన్ఈ నెల 17తో ముగియనున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై ఆయన ప్రసంగించనున్నారు. తొలి దశ లాక్‌డౌన్‌లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని, అలాగే, రెండో దశలో తీసుకున్న పలు చర్యలను మూడో దశలో తీసుకోలేదని మోడి నిన్న సీఎంలతో అన్నారు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోడి స్పష్టం చేశారు. దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక జాతినుద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/