అట్టహాసంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌ మెంట్‌

టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్లర్స్ గా ఉన్న హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అవ్వగా..తాజాగా ఈ జాబితాలో హీరో శర్వానంద్‌ చేరారు. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబానికి చెందిన రక్షిత రెడ్డితో… హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌ మెంట్‌ అయ్యింది. ఈ ఎంగేజ్‌ మెంట్‌ వేడుకకు హీరో రామ్‌ చరణ్‌ మరియు ఉపాసన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది.

రక్షిత రెడ్డి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుందట. రక్షితరెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలుస్తుంది. ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనువరాలని సమాచారం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రక్షిత, కరోనా విజృంభణ తర్వాత ఇండియాకు వచ్చిందట. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మెప్పించాడు. ఆ తర్వాత మంచి కథలు సెలక్ట్ చేసుకుని హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మంచి కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా కంటే ముందు వరుసగా 5 ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు.