అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడి

ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు మోడి ..

pm modi
pm modi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్‌ కుటుంబంతో భారత్‌ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడి అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడితో కలిసి డొనాల్డ్ ట్రంప్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. అనంతరం మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరవుతారు. కాగా.. అమెరికా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా మరికొద్ది నిమిషాల్లో అమెరికా అధ్యక్షుడు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/