సమంత త్వరగా కోలుకోవాలంటూ అక్కినేని హీరో విషెష్

మయోసిటిస్‌ అనే ప్రమాద వ్యాధి తో సమంత బాధపడుతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె చెప్పడం తో అంత ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సినీ , రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున త్వరగా ఈ వ్యాధి నుండి బయటపడాలని దేవుడ్ని కోరుకుంటున్నారు. తాజాగా అక్కినేని హీరోలు కూడా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ విష్ చేస్తున్నారు.

మొదట అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్ స్పందిస్తూ సమంత త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటూ గెట్ వెల్ సూన్ చెప్పాడు. ఆ తర్వాత అక్కినేని మరో హీరో అఖిల్ కూడా సమంత ఇన్ స్టా పోస్ట్ కు కామెంట్ పెట్టాడు. అఖిల్ స్పందిస్తూ డియర్ సామ్ అందరి ప్రేమ మరియు బలం నీకు అందుతుంది అంటూ గెట్ వెల్ సూన్ మెసేజ్ ను పెట్టడం జరిగింది. అఖిల్ కామెంట్ ఇన్ స్టా లో వైరల్ అయ్యింది. అంతే కాకుండా ఎన్టీఆర్.. చిరంజీవి.. మంచు లక్ష్మి తో పాటు పదుల సంఖ్య లో సెలబ్రెటీలు సమంత యొక్క ఆరోగ్యం వెంటనే కుదుట పడాలని ప్రార్థిస్తున్నాం అంటూ పేర్కొన్నారు.