ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచింది – ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఫై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాశ వ్యక్తం చేసారు.

పాత పేర్లు మార్చి.. కొత్త పేర్లు పెడుతున్నారు అంతేనని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగం సరిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రగతి గేర్చు మార్చే అంశాలేవి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌లో లేవన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నో హామీలను బడ్జెట్‌లో ప్రస్తావించలేదని కవిత ఆరోపించారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామన్నారు.. కానీ బడ్జెట్‌ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు.