ముంబయి జైలులో 103 మందికి కరోనా

బాధితుల్లో 77 మంది ఖైదీలు.. మిగతా వారు జైలు సిబ్బంది

103-test-positive-at-arthur-road-prison

ముంబయి: ముంబయిలోని ఆర్థర్‌ రోడ్డు జైలులో 103 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు కాగా, మిగతా వారు జైలు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఉదయం బాధితులందరినీ ముంబైలోని సెయింట్ జార్జ్, గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు. డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, అతడి నుంచి మిగతా వారికి అది సంక్రమించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా 800 మంది మాత్రమే ఉండాల్సిన ఆర్థర్ రోడ్డు జైలులో ప్రస్తుతం 2600 మంది ఖైదీలు ఉండడంతో కిక్కిరిసిపోయింది.ఈసందర్భంగా చిన్న నేరాలతో జైలుకు వచ్చిన 11 వేల మందిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/