డబ్బింగ్ మొదలుపెట్టిన పుష్పరాజ్

డబ్బింగ్ మొదలుపెట్టిన పుష్పరాజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు తప్పకుండా ఫాలో అవుతున్నారు. గతంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్ట్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో పుష్ప చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను చిత్ర యూనిట్ గతంలోనే రిలీజ్ చేసింది. ఇప్పుడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పుష్ప టీజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆశగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం బన్నీ డబ్బింగ్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించి ఓ చిన్న పూజా కార్యక్రమం కూడా జరిగింది. తొలుత టీజర్ కోసం డబ్బింగ్ చెప్పనున్న బన్నీ, ఆ తరువాత తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో బన్నీ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండటంతో బన్నీ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.