తిరుమలలో బాలుడి కిడ్నాప్‌ ..

తిరుమలలో ఐదేండ్ల బాలుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. కడపకు చెందిన దంపతులు తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. తిరుమల కొండపై పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త స్థానికంగా పని చేసుకుంటుండగా.. భార్య తిరుమల కొండపై తిరునామాలు పెడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తల్లి భక్తులు నామాలు పెడుతూ..తమ పిల్లాడిని పక్కన కూర్చోబెట్టింది. అయితే, శ్రీవారి ఆలయం ఎదురుగా కూర్చొని ఉన్న బాలుడిని మహిళ కిడ్నాప్‌ చేసింది. ఆదివారం సాయంత్రం 5.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దాదాపు 6 గంటల సమయంలో కుమారుడు కనిపించకపోవడాన్ని గమనించిన తల్లి.. కంగారుపడ్డారు. ఎంత వెతికిన బాలుడు కనిపించకపోయేసరికి పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదు తీసుకొన్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా..బాలుడిని ఓ మహిళా ఎత్తుకెళ్లినట్లు తేలింది. సదరు మహిళ తిరుపతి వచ్చి ఏపీ03 జడ్‌ 0300 నంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసుల దర్యాప్తు చేపట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ గుండు చేపించుకుని ఉన్నారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి పేరు గోవ‌ర్ధ‌న్ రాయ‌ల్ అని పోలీసులు తెలిపారు.