కావాల్సింది సాధించి రైతులంటే ఏంటో నిరూపించారు: కేటీఆర్

సాగు చట్టాల రద్దుపై మంత్రి కేటీఆర్​

హైదరాబాద్ : సాగు చట్టాల రద్దుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇవాళ ఉదయం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. తాజాగా కేటీఆర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘‘అధికారంలో ఉన్న వారి శక్తికన్నా.. వారిని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల శక్తి మరింత శక్తిమంతమైనది’’ అంటూ ట్వీట్ చేశారు. అలుపులేని పోరాటంతో తమకు కావాల్సిన దానిని సాధించుకుని.. భారత రైతులంటే ఏంటో నిరూపించారని కామెంట్ చేశారు. జై కిసాన్.. జై జవాన్ అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల వెంటే ఉంటుందన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/