పార్ల‌మెంట్ లో కొత్త బిల్లును పాస్ చేసిన పాకిస్థాన్

ర‌సాయ‌నాల‌తో రేపిస్టుల‌కు శిక్ష‌..బిల్లుకు ఆమోదం

ఇస్లామాబాద్‌: సీరియ‌ల్ రేపిస్టుల‌కు శిక్ష‌ను క‌ఠిన‌త‌రం చేస్తూ పాకిస్థాన్ పార్ల‌మెంట్ కొత్త బిల్లును పాస్ చేసింది. అత్యాచార కేసుల్లో దోషుల‌గా తేలిన వారికి.. ర‌సాయ‌నాల ద్వారా సెక్సు హోర్మెన్ల‌ను త‌గ్గించే శిక్ష‌ను విధించ‌నున్నారు. ఇటీవ‌ల పాకిస్థాన్‌లో మ‌హిళ‌లు, చిన్నారుల‌ ప‌ట్ల లైంగిక దాడులు ఎక్కువ‌య్యాయి. అత్యాచార నేరాల‌ను నియంత్రించాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ ప్ర‌భుత్వం కొత్త త‌ర‌హా క‌ఠిన చ‌ట్టాన్ని చేసింది. లైంగిక దాడుల‌కు పాల్ప‌డుతున్న వారికి కెమిక‌ల్స్ ద్వారా పురుష క‌ణాల‌ను నిర్వీర్యం చేసే శిక్ష‌ను అమ‌లు చేయాల‌ని బిల్లును చేశారు.

ఏడాది క్రిత‌మే అధ్య‌క్షుడు ఆరిఫ్ అల్వి దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు క్లియ‌రెన్స్ ఇచ్చారు. రేప్ కేసుల్లో దోషుల వాంగ్మూలం తీసుకున్న త‌ర్వాతే కెమిక‌ల్ క్యాస్ట్రేష‌న్ చేయాల‌ని బిల్లులో పేర్కొన్నారు. నేర చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు 2021తో పాటు మ‌రో 33 బిల్లుల‌కు పాకిస్థాన్ పార్ల‌మెంట్ బుధ‌వారం ఆమోదం తెలిపింది. కెమిక‌ల్ క్యాష్ట్రేష‌న్ శిక్ష‌లో భాగంగా లైంగిక సామ‌ర్ధ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు డ్ర‌గ్స్ వాడ‌నున్నారు. అయితే మెడిక‌ల్ బోర్డు స‌మ‌క్షంలో ఆ డ్ర‌గ్స్ ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఈ బిల్లుకు వ్య‌తిరేకంగా జ‌మాత్ ఇ ఇస్లామి సేనేట‌ర్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. ఇది ష‌రియా చ‌ట్టానికి, ఇస్లామిక్ మ‌త విశ్వాసాల‌కు వ్య‌తిరేకం అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/