సీజేఐగా జస్టిస్ ఎన్​.వి రమణ ప్రమాణం

55 ఏళ్ల తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా కీర్తి

సీజేఐగా జస్టిస్ ఎన్​.వి రమణ ప్రమాణం
Justice NV Ramana swears in as CJI

New Delhi: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్​.వి. రమణ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్ ఎన్​.వి రమణచే ప్రమాణం చేయించారు. 55 ఏళ్ల తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ ఎన్.వి. రమణ కీర్తికెక్కారు . గతంలో రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆగస్టు 26 వరకు జస్టిస్‌ ఎన్‌.వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/