గౌత‌మ్ రెడ్డి భౌతికకాయానికి నివాళుల‌ర్పించి మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఏపీ మంత్రి గౌత‌మ్ రెడ్డి భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళుల‌ర్పించి, పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు. అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గౌత‌మ్ రెడ్డితో త‌న‌కు 12 ఏండ్లుగా ప‌రిచ‌యం ఉంద‌న్నారు. ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న నాయ‌కుడు గౌత‌మ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/