మంత్రి ఎర్రబెల్లి దయకర్‌ భావోద్వేగం

సిఎం కెసిఆర్‌కు నా ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం..ఎర్ర‌బెల్లి

మంత్రి ఎర్రబెల్లి దయకర్‌ భావోద్వేగం
minister-errabelli

కొడకండ్ల: సిఎం కెసిఆర్‌ కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో రాష్ర్ట పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు భావోద్వేగ ప్ర‌సంగం చేశారు. న‌ల‌భై ఏండ్ల నా రాజ‌కీయ జీవితంలో అంద‌రూ న‌న్ను వాడుకున్నారు. ఏ ఒక్క‌రూ కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. నేడు ముఖ్య‌మంత్రి కెసిఆర్ ద‌య‌వ‌ల్లే నాకు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. ఆయ‌న ఆశీస్సుల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగు చేసుకుంటున్నాను. కెసిఆర్ ఆశీర్వాదం నాకు ఎల్ల‌ప్పుడూ ఉండాలి. సీఎం కేసీఆర్‌కు నా ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. కెసిఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంది. కెసిఆర్ ప్రాణం ఉన్నంత వ‌ర‌కు మోటార్లకు మీట‌ర్లు ప‌రిస్థితి రాదని న‌మ్ముతున్నాను అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు విశ్వాసం వ్య‌క్తం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/