పట్నం సునీతకు ఎంపీ టికెట్ ..?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ MLC పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి చేరేందుకు డిసైడ్ అయ్యారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన వీరు..ఈరోజు , లేదా రేపు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. మహేందర్ సతీమణి సునీత ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. ఆమెకు చేవెళ్ల ఎంపీ టికెటు కాంగ్రెస్ కన్ఫర్మ్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.

అందుకే పట్నం దంపతులు హస్తం కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని చర్చ నడుస్తోంది. నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మహేందర్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపాడు. ఇప్పుడు అదే జరగబోతున్నట్లు తెలుస్తుంది.