చైనా, జపాన్‌ నుండి ఢిల్లీకి భారతీయుల తరలింపు

జపాన్ విహారనౌక నుంచి విమానం ద్వార తరలింపు

Japan-Ship-Indians
Japan-Ship-Indians

న్యూఢిల్లీ: జపాన్‌ విహార నౌక డైమండ్‌ ప్రిన్సెన్‌లో కరోనా వైరస్‌(కొవిడ్‌ -19) బారిన పడిన 119 మంది భారతీయులను ఎయిర్ ఇండియా విమానంలో గురువారం న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. జపాన్ దేశ తీరంలో ఉన్న విహార నౌక నుంచి భారతీయులను టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చి అక్కడి నుంచి విమానంలో న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. విహారనౌకలో కొవిడ్ వ్యాప్తితో నిర్బంధానికి గురైన భారత పౌరులను ఖాళీ చేయించి తీసుకువచ్చేందుకు సహకరించిన జపాన్ అధికారులకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు ఉదయం న్యూఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 119 మంది భారతీయులతోపాటు ఐదుగురు శ్రీలంక, నేపాల్, దక్షిణ ఆఫ్రికా, పెరూ దేశాల జాతీయులున్నారు. జపాన్ దేశానికి చెందిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో మొత్తం 3,711 మంది ఉండగా వారిలో 132 మంది భారత సిబ్బంది, ఆరుగురు భారత ప్రయాణికులు. విహారనౌకలో జరిపిన పరీక్షల్లో కొందరికి కొవిడ్ 19 పాజిటివ్ అని రావడంతో ఈ నెల 5వతేదీ నుంచి నౌకలోనే నిర్బంధించి చికిత్స అందించారు. నౌకలోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన ఎయిర్ ఇండియాను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభినందించారు. చైనా దేశంలోని వూహాన్ నగరం నుంచి కూడా ఎయిర్ ఇండియా 640 మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/