ఇద్దరి పేద విద్యార్థులకు సాయం చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సాయం కావాలని కోరిన వారికీ సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. విద్య, ఆరోగ్యానికి సంబంధీచి సమస్యలతో బాధపడుతున్నవారికి కేటీఆర్ చాలా మందికి సాయం చేసారు. తాజాగా చదువులో ఉతీర్ణులైన ఇద్దరు పేద విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఐఐటీ కారగపూర్ లో ఇంజనీరింగ్ సీటు సాధించారు. ఇంకొకరు నీట్ పరీక్షలో ర్యాంకు సాధించి సూర్యాపేట ప్రభుత్వం మెడికల్ కాలేజీ లో ఎంబీబీస్ సీటును సాధించారు.

కాగా, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలంలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు పిడపర్తి కుమారుడు అనిల్ కుమార్ ఐఐటీ ఖరగ్ పూర్ లో అ ప్లైడ్ జియాలజీలో ఇంజనీరింగ్ సీటు సాధించాడు. తన ఆర్ధిక ఇబ్బందులను సోషల్ మీడియా ధ్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. అనిల్ కుమార్ పోస్ట్ పై స్పందించి …తన చదువుకు కావాల్సిన సాయాన్ని చేశారు. చదువు పూర్తయ్యాక తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ,ఇతరులకు సాయం అందించాలని చెప్పారు. మహబూనగర్ కు చెందిన ఆటో డ్రైవర్ గోపాల్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేటలో మెడికల్ కాలేజీ లో ఎంబీబీస్ సిట్ సాధించాడు. ప్రశాంత్ రెడ్డి గత నెల కేటీఆర్ కు చదువుకు సాయం చేయండి అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి స్పందిచిన కేటీఆర్.. ఈరోజు తనని తన కార్యాలయంలో కలసి విద్యకు అవసరమైన ఆర్థిక సాయాన్ని చేసారు.

తాజా ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/