కార్పెంటర్​ ప్రతిభకు మంత్రి కెటిఆర్ ఫిదా

సూట్‌ కేసు మాదిరిగా మడత పెట్టే సత్యనారాయణ స్వామి వ్రత పీఠం

Minister KTR Fida for Carpenter Pratibha

హైదరాబాద్‌ః ఓ కార్పెంటర్ తన వృత్తి నైపుణ్యంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ దృష్టిని ఆకర్షించాడు. సూట్‌ కేసు మాదిరిగా మడత పెట్టే సత్యనారాయణ స్వామి వ్రత పీఠం తయారు చేశాడు. సూట్‌ కేసులా తీసుకొచ్చి దాన్ని విడి చేసి పీఠంలా మార్చుకునేలా రూపొందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులో ఓ సూట్ కేసు రూపంలో ఉన్న ఓ చెక్కె పెట్టెను తీసుకొని వచ్చారు.

దానిని ఓపెన్ చేసి, అందులోని విడి భాగాలను బయటకు తీసి ఒక్కొక్కటిగా పేరుస్తూ వెళ్లగా వ్రత పీఠంలా మారింది. ఇంత నైపుణ్యం ప్రదర్శించిన ఆ కార్పెంటర్ కు సాయం అందించాలని మంత్రి కెటిఆర్ ను కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సదరు కార్పెంటర్ నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు. అతనికి ఎలా సాయం చేయవచ్చో పరిశీలించాలని హైదరాబాద్‌ లోని టీ–వర్క్స్ అధికారులకు సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.