పవన్ అంటే నాకూ అభిమానమే అంటున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆ అభిమానం సామాజికవర్గం పరంగా వచ్చిందేనని కాకపోతే తామందరం బాధపడేలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కాపులు ముఖ్యమంత్రి కావాలని అనుకునే వారు పవన్ వెంట వెళ్లి కేరింతలు కొడుతున్నారని, కానీ కాపుల్ని సీఎంగా చూడాలన్న ఆలోచన తనకెందుకు ఉంటుందని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ – చంద్రబాబు ల మధ్య ఉన్నది అపవిత్ర పొత్తు అని , పవన్ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేస్తానని అంటున్నారని, ఆ పని చేసి కాపుల పరువు తీయొద్దని మంత్రి చెప్పుకొచ్చారు. పవన్ వ్యవహారశైలి చూసి .. ‘ఆయన్ను ఎవరికైనా చూపించడ్రా’ అంటూ జనం సినిమా డైలాగులు చెబుతున్నారని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు, పవన్ వల్ల కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం మంత్రి చేసిన కామెంట్స్ ఫై జనసేన కార్యకర్తలు , నేతలు మండిపడుతున్నారు.