పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజి స్టార్ అని వందసార్లు అంటా – అంబటి

పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజి స్టార్ అని వందసార్లు అంటా అని అంబటి రాంబాబు అన్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. జనసేన vs వైస్సార్సీపీ గా మారింది. వైస్సార్సీపీ నేతలపై దాడి చేసారని జనసేన కార్య కర్తలను అరెస్ట్ చేయడం , పవన్ కళ్యాణ్ పర్యటన ను వైస్సార్సీపీ అడ్డుకోవడం వంటివి ఉద్రికత్త పరిస్థితులకు దారితీసాయి. ఈ క్రమంలో మంగళవారం జనసేన అధినేత పవన్ మీడియా సమావేశం ఏర్పటు చేసి వైస్సార్సీపీ నేతలను హెచ్చరించారు. . ‘నా కొడకల్లారా.. మీకు మాములుగా ఉండదు.. సన్నాసుల్లారా.. వెధవల్లారా..ఏంట్రా మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ‘ అంటూ వైస్సార్సీపీ నేతలపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఫై వైస్సార్సీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాన్ అసలు సిసలైన రూపం, ఈ రోజు బయట పడిందని అన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్, ఒకసారి కాదు వంద సార్లు అంటానని అన్నారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కి లేదన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసించినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జనసెనికులకు హెచ్చరిక… కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండని అన్నారు. చివరికి నువ్వు చూపించే “చెప్పే” నీ పార్టీ సింబల్ అవుతుందని ఎద్దేవా చేశారు.

పవన్ తన ఫ్రస్ట్రేషన్ అంతా ఈ మీటింగులో చూపించారని.. ఆయనకు స్థిరత్వం లేదని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. మూడో భార్య కూడా వదిలేసినట్లుందని.. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నారని అమర్ నాథ్ అన్నారు. చెప్పుతో కొడతామని అనడం ఆయన వైఖరికి నిదర్శనమని.. గత ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయణ్ను ఓడించి చెప్పుతో కొట్టారని.. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడమంటే అదేనని అన్నారు.

ఒక పెళ్లి చేసుకుని 30 స్టెపినీలతో తిరుగుతున్నామని పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాము ఒక పెళ్లితో 30 స్టెపినీలతో తిరిగితే.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పీకే 3వేల మందితో తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. అసలు పీకే అంటే పెళ్లిళ్ల కల్యాణ్ అని పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. లేదంటే పిచ్చికుక్క బెటర్ అని అదీకాకపోతే ప్యాకేజ్ కల్యాణ్ కరెక్ట్ గా సరిపోతుందని అమర్ నాథ్ అన్నారు.