కేంద్ర హోంమంత్రి అమితిషాతో ముగిసిన సీఎం జగన్ భేటీ

ap-cm-meeting-with-amit-shah-ended

న్యూఢిల్లీ : సీఎం జగన్ రెండోరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమితిషాతో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వీరి సమావేశంలో ప్రధానంగా విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం . నిన్న ప్రధాని మోడీతో సమావేశమై వివరించిన రాష్ట్ర సమస్యలను అమిత్‌షాకు విన్నవించారు. రెవెన్యూ లోటు నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా జగన్‌ కోరారు.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో సవరణలు, అన్ని జిల్లాలో మెడికల్‌ కళాశాల మంజూరు చేయాలని కోరారు. 2014-15 రెవెన్యూలోటుతో పాటు 32,625 కోట్లు ఏపీ ప్రభుత్వానికి రావల్సి ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ఏపీ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులను మంజూరు చేయాలని హోం మంత్రికి విన్నవించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/