ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఇంద్రకరణ్
TS Minister Indrakaran Reddy
నిర్మల్: జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఓటర్లు ఓటేసేందుకు బారులు తీరారు. అటు భైంసాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
కాగా, ఇటీవలే 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే, వాటిలో రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాల చొప్పున, అలాగే, నిజామాబాద్, వరంగల్‌లో ఒక్కో సీటు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. దీంతో నేడు కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో సీటుకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/