తుది శ్వాస విడిచే సమయంలో నీళ్లు కావాలని అడిగినన్ బిపిన్ రావత్..

తమిళనాడు కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఈయనతో పాటు ఈయన భార్య సహా మరో 11 మంది మృతి చెందారు. అయితే బిపిన్ రావత్ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్ అనే వ్యక్తి తెలిపారు. కానీ ఆయనకు నీళ్లు ఇవ్వలేకపోయానని..ఆ ప్రమాదం ప్లేస్ కు వెల్లేకపోయాయని..చుట్టూ మంటలు ఉండడం తో కుదరలేదని శివకుమార్ తెలిపారు.
శివ కుమార్ ఏమన్నాడంటే…‘‘వేరే పని కోసం నేను రోడ్డుపై నడిచి వెళుతుండగా…పలువురు హెలికాప్టర్ కూలిందని కేకలుపెట్టారు. వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్లాను. చెట్టును ఢీకొన్న హెలికాప్టర్ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొన ప్రాణాలతో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, మంచి నీళ్లు ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్లలేకపోయాను. ఇంతలో భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ఆయనను, మరొకరిని దుప్పట్లలో చుట్టి అక్కడినుంచి తీసుకుపోయాయి. ఆ తరువాత తెలిసింది… ఆయనే బిపిన్ రావత్ అని’’ అని శివకుమార్ అన్నారు. ఇక ఈరోజు దిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రేవంత్ దంపతుల అంత్యక్రియలు జరపనున్నారు.