నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లెలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. 11.30 గంటలకు ముస్తాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేస్తారు.

12 గంటలకు చీకోడులో సీసీ కెమెరాలు, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ను, మధ్యాహ్నం 12.30 గంటలకు గూడెంలో పీఏసీఎస్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. ఒంటి గంటకు సేవాలాల్‌ తండాలో జగదాంబాదేవీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పోతుగల్‌ గ్రామంలోని బండమీది రామాలయంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరవుతారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/