వాళ్ల మాటలు నమ్మి మోసపోకండి

సదాశివపేట, తూప్రాన్‌ రోడ్‌ షోలలో మంత్రి హరీశ్‌ రావు

Harish Rao
Harish Rao

తూప్రాన్‌: ప్రజలెవ్వరూ కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని మంత్రి హరీశ్‌ రావు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే నిరుపేద దివ్యాంగులు, వితంతువులకు ఆర్ధిక సహాయం అందించడంలో కెసిఆర్‌ సర్కార్‌ సఫలం అయ్యిందని ఆయన అన్నారు. ఆసరా పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మెదక్‌ జిల్లా తూప్రాన్‌లలో నిర్వహించిన రోడ్‌ షోలలో హరీశ్‌రావు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాకుండా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి ఆయన కోరారు. గజ్వేల్‌, తూప్రాన్‌లోని అన్ని వార్డులో టిఆర్‌ఎస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ రోడ్‌ షోలో మంత్రి వెంట ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్యెల్యె మాణిక్‌రావు, మాజీ ఎమ్యెల్యె చింతా ప్రభాకర్‌ పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/