నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు
Harish Rao was elected as President for Nampally Exibition Society

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఎన్నికయ్యారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ యాజమాన్య కమిటీ శనివారం ప్రకటించింది. ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించిన మంత్రి హరీశ్‌ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు . సొసైటీని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హరీశ్ రావు పేర్కొన్నారు. సభ్యుల సహకారంతో సొసైటీ ని ముందుకు తీసుకెళుతానని స్పష్టం చేశారు.

80 ఏళ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. కెసిఆర్‌ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆయన వివరించారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా వారిని తీర్చిదిద్దుతామని హరీశ్ రావు పేర్కొన్నారు.