బడ్జెట్‌ కాంగ్రెస్‌ భ్రమలను బద్దలుకొట్టింది

శాసన సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో హరీశ్‌ రావు

Minister harish rao
Minister harish rao

హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ ప్రజలందరినీ సంతోషపెట్టే విధంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ బడ్జెట్‌ కాంగ్రెస్‌ నేతల భ్రమలను బద్దలు కొట్టిందని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్‌ సూచనలతో మారవీయ కోణంలో అద్భుతమైన బడ్జెట్‌ను రూపొందించామని ఆయన చెప్పారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సందర్భంగా హారీశ్‌ రావు మాట్లాడారు. సంక్షేమ రంగానికి కేటాయింపులు పెంచామన్నారు. ఇప్పటికే 40 లక్షలు మందికి ఆసరా ఫించన్లు అందిస్తున్నామని, 57 ఏళ్లు నిండిన అందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని తెలపారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేలకోట్లు కేటాయించామని అన్నారు. రైతు బంధు సమితుల ద్వారా రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరిని జీవనదిగా మార్చామని హరీశ్‌ రావు వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/