భోళా శంకర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్

వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..అదే జోష్ తో భోళా శంకర్ కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. మెహర్ రమేష్ – చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ వేదాళ‌మ్ రీమేక్‌గా వస్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా షూటింగ్ మొదలుకాగా..ఈరోజు నుండి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్‌లో ఈరోజు భోళా శంకర్ కొత్త షెడ్యూల్‌ షూటింగ్ మొదలైంది. ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీలో మెహర్‌ రమేశ్ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.