అయోధ్య కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందిః బండి సంజయ్

bandi-sanjay

హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణానికి సానుకూలమా? వ్యతిరేకమా? స్పష్టం చేయాలని ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అయోధ్య రామయ్య అందరికీ దేవుడు…ప్రతి భారతీయుడు రాముడి విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపినిచ్చారు. రామ మందిర నిర్మాణం బిజెపికి సంబంధించిన కార్యక్రమం కానేకాదు…పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని బండి సంజయ్ కోరారు.

ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందని..పవిత్రమైన కార్యక్రమాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్ కు తగదని ఆగ్రహించారు. అయోధ్య నుంచి శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికి వెళుతున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదు…కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదని…కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ తీరు బిఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని చురకలు అంటించారు.