ఊటిలో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..

తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్​లో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు.

ప్రమాద సమయంలో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన భార్య, డిఫెన్స్​ అసిస్టెంట్​, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్​ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్​లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు మరణించినట్లు అనధికారిక వర్గాల నుంచి సమాచారం. సూలూర్​ వైమానిక స్థావరం నుంచి డిఫెన్స్​ సర్వీసెస్​ కాలేజీకి(డీఎస్​సీ) వెళ్తుండగా వెల్లింగ్టన్​ వద్ద కుప్పకూలింది. 80 శాతానికిపైగా కాలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.