పచ్చని కాపురంలో ‘టమాటా’ ఎంత పనిచేసింది

టమాటా ధర ఇప్పుడు సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టించడమే కాదు..పచ్చని కాపురంలో చిచ్చులుపెడుతుంది. ఏంటి నమ్మడం లేదా..? ఇది నిజం. మధ్యప్రదేశ్‌లో టమాటా కారణంగా పచ్చని కాపురం చెల్లా చెదురైంది. ఎంతో అన్యూన్యంగా జీవిస్తున్న భార్యాభర్తల మధ్య ఈ టమాటా చిచ్చు పెట్టింది. షాదోల్ జిల్లా బేమ్‌హారి గ్రామంలో సంజీవ్ కుమార్ వర్మ అతని భార్య బిడ్డతో నివసిస్తున్నాడు. ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న సంజీవ్ కుమార్.. ఎప్పటిలాగే పూరీలోకి వెజిటెబుల్ సబ్జా తయారు చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే మంచి రుచి కోసం భార్యకు తెలియకుండా అదనంగా రెండు టమాటాలు ఆ కర్రీలో వేశాడు. ఇదే ఆయన చేసిన పొరపాటు. విషయం తెలుసుకున్న సంజీవ్ భార్య కోపంతో ఉగిపోయింది. కిలో 200 రూపాయలకు అమ్ముతుంటే కూరలో టమాటాలు వేయడానికి నీవేమన్నా కోటీశ్వరుడివా అని నిలదీసింది. నీలాంటి వాడితో కాపురం చేయలేనంటూ కుమార్తెను తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో లబోదిబోమన్న సంజీవ్‌ ధన్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్యను వెదికిపెట్టమంటూ వారిని అభ్యర్థించాడు. సంజయ్ చెప్పిన మాటలు విని పోలీసులు సైతం షాక్ అయ్యారు.

దేశంలో పెరిగిన టమాట ధరలు చోరీలు, హత్యలకే కాకుండా ఇలా పచ్చని కాపురాలను సైతం విడగొడుతున్నాయా..అని అంత మాట్లాడుకుంటున్నారు.