ఏపీలో కొత్త రంగులో పల్లెవెలుగు బస్సులు ఎలా ఉన్నాయో చూడండి

ఏపీలో పల్లెవెలుగు బస్సుల రంగులు మార్చేస్తున్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పల్లెవెలుగు బస్సులను తీసుకొచ్చారు. పాసుపు ఆకుపచ్చ , తెలుపు రంగులలో ఈ బస్సులకు కలర్ వేసి పల్లెల్లో నడిపించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ బస్సులు అదే కలర్ లో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో పల్లెవెలుగు బస్సుల రంగులు మార్చే పనిలో ఉన్నారు అధికారులు.

అనకాపల్లి ఆర్టీసీ డిపోలోని పల్లె వెలుగు బస్సులకు రంగులు మారాయి. ఇప్పటి వరకు పల్లె వెలుగు బస్సులకు తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు ఉండేవి. తాజాగా తెలుపు, సిమెంట్‌, ఆకుపచ్చతో పాటు సన్నటి పసుపు గీతతో బస్సులు కనిపిస్తున్నాయి. అనకాపల్లి డిపోలో 40 పల్లె వెలుగు బస్సులు, మరో 24 అద్దె బస్సులు ఉన్నాయి. రెండు రోజులు నుంచి డిపో గ్యారేజీలో ఈ బస్సుల రంగులను మార్చడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రంగుల కోసం ఒక్కొక్క బస్సుకు రూ.23 వేలు ఖర్చవుతుందని అధికారులు అంచనాగా చెబుతున్నారు. ఈ లెక్కన డిపోలోని 40 బస్సులకు రంగులు వేయాలంటే రూ.9.2 లక్షలు ఖర్చు కానుంది. 24 అద్దె బస్సులకు రూ.5.29 లక్షలు ఖర్చు కాగా, ఈ భారాన్ని ఆయా బస్సుల యజమానులే భరించాల్సి ఉంటుంది.