మిగిలింది రేపు ఒక్క రోజే..

అఫ్గాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ దేశాల వారు అక్కడ ఉండడం తో వారి స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ దేశాలు. ఆగస్టు 31 వరకు గడువు ఉంది. ఈ లోగా ఉన్న వారందర్ని తమ దేశాలను తీసుకురావాలి. ఇప్పటికే పలు దేశాలు ఆ పనిని పూర్తి చేయగా..అమెరికా ఇంకా దాదాపు 300 మంది అమెరికా పౌరులు అఫ్గాన్‌లో ఉన్నారు. వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు అమెరికా చేస్తున్నప్పటికీ కాబూల్ విమానాశ్రయం చుట్టూ పక్కల వరుస బాంబ్ పేలుళ్లు భయాందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా జరిగిన మరో రాకెట్‌ దాడిలోనూ ఓ చిన్నారి మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్థానికంగా శాశ్వతమైన కార్యాలయం లేకున్నా ఉగ్రవాదాన్ని అణచివేసే సామర్థ్యం తమకు ఉందని అమెరికా పేర్కొంది. ఆగస్టు 31 గడువులోగా తమ సిబ్బందిని (300 మంది) తరలిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, మరోసారి బాంబు దాడులు జరుగుతాయని పసిగట్టిన అమెరికా దళాలు.. కాబుల్‌ విమానాశ్రయానికి దూరంగా వెళ్లిపోవాలని అమెరికా పౌరులకు సూచించాయి.