చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన BRS ఎమ్మెల్యే

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయినా మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ఫై రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. టీడీపీ పార్టీనే కాకుండా ఇతర పార్టీ నేతలు సైతం పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతూ..ఆయన అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ నేతలు సైతం బాబు అరెస్ట్ ఫై వారి స్పందనను తెలియజేయగా…తాజాగా BRS ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పందించారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ… టీడీపీ అధినేత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. ఆయనకు ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉందని, ఐటీ రంగంలో ఆయన వల్ల అనేకమందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోందన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా ఖండించింది. అనుమానాల ప్రాతిపదికన అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఆధారాలు చూపకుండా ఆరోపణలపై అరెస్ట్ బాధాకరమని, అంతేకాకుండాప్రతిపక్ష నేత అరెస్ట్‌లో పారదర్శకత కనిపించలేదని పేర్కొంది.