బిజెపిలో చేరిన మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌

మలప్పురం: మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్ బిజెపిలో చేరారు. కేర‌ళ బిజెపి అధ్య‌క్షుడు కే సురేంద్ర‌న్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న‌ బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. మ‌రో రెండు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో విజ‌య్ యాత్ర పేరుతో సురేంద్ర‌న్ రాష్ట్రంలో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. అందులోభాగంగా గురువారం రాత్రి చంగ‌రాంకులంలో స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా సురేంద్ర‌న్ మెట్రోమ్యాన్‌గా ప్ర‌సిద్ధి చెందిన‌ శ్రీధ‌ర‌న్‌కు పూల‌మాల‌వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం శ్రీధ‌ర‌న్ మాట్లాడుతూ.. ఇద త‌న జీవింలోని అత్యంత ముఖ్య‌మైన ఘ‌ట్టాల్లో ఒక‌ట‌ని చెప్పారు. త‌నను బిజెపిలోకి ఆహ్వానించిన శ్రీధ‌ర‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా తాను బిజెపిలో చేర‌నున్న‌ట్లు శ్రీధ‌ర‌న్ గ‌త వార‌మే ప్ర‌క‌టించారు. కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ కూడా చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/