భారత్‌ బయోటెక్‌ నుండి టీకాలు ఖరీదు చేయనున్న బ్రిజిల్‌

బ్రసిలియా: భార‌త్ బ‌యోటెక్ ఫార్మా సంస్థ నుంచి బ్రెజిల్ సుమారు రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల‌ను ఖ‌రీదు చేయ‌నున్న‌ది. దీనికి సంబంధించి బ్రెజిల్ ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ భార‌త్ బ‌యోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. మార్చి నుంచి మే నెల వ‌ర‌కు కోవిడ్ టీకా డోసుల‌ను డెలివ‌రీ చేయ‌నున్నారు. భార‌త్ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాల‌ను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ ఒప్పందం విలువ సుమారు మూడు ల‌క్ష‌ల డాల‌ర్లు ఉంటుంద‌ని బ్రెజిల్ పేర్కొన్న‌ది. మార్చి నెల‌లో తొలి 80 ల‌క్ష‌ల టీకా డోసులు బ్రెజిల్‌కు చేర‌నున్నాయి. ప్ర‌స్తుతం బ్రెజిల్‌లో రెండ‌వ ద‌ఫా క‌రోనా వైర‌స్ కేసులు విజృంభిస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/