బిగ్ బాస్ 5 : జెస్సి కి షాక్ ఇచ్చిన బిగ్ బాస్..ఇంట్లో నుండి బయటకు వెళ్లిపొమ్మని హెచ్చరిక

బిగ్ బాస్ 5 తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న జెస్సి కి బిగ్ బాస్ షాక్ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న జెస్సి ని ఇంటికి పంపించారు. తొలుత స్వాతిముత్యంలో క‌మ‌ల్ హాస‌న్ లాగా ఉండేవాడు. అస‌లు ఎందుకు తీసుకున్నార‌ని, వెంట‌నే ఎలిమినేట్ చేసేయ్య‌డ‌ని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప‌లుసార్లు కింగ్ నాగార్జున కూడా గేమ్ మీద ఫోక‌స్ చేసి.. అంటూ క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత త‌న గేమ్ ఫ్లాన్ మొత్తం మార్చేశాడు. త‌న‌దైన స్టైల్లో గేమ్ ఆడుతూ.. ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒక‌రిగా నిల‌బ‌డ‌టానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఇంతలో అనారోగ్యం జెస్సిని ఇబ్బందుల్లోకి నెట్టింది.

సోమవారం రాత్రి ప్రసారమైన బిగ్‌బాస్ షోలో జెస్సీని వైద్యుడు పరీక్షించడం కనిపించింది. వెర్టిగో అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న జెస్సీని వైద్యుడు పరీక్షించి సరిగా మాత్రలు వాడుతున్నావా? సమయానికి ఆహారం తీసుకొంటున్నావా అంటూ ప్రశ్నించడం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిలో చికిత్స పొందుతున్న జెస్సీ ఆరోగ్య మరింత క్షీణించడంతో బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జస్వంత్ పరిస్థితి ఇంకా మెరుగుపడటం లేదనే విషయం తెలుసు అని బిగ్‌బాస్ అంటే.. అవును అని జస్వంత్ సమాధానం ఇచ్చాడు. దాంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంది. మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు రండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు.

బిగ్‌బాస్‌తో మాట్లాడిన తర్వాత థ్యాంక్యూ చెప్పి కన్ఫెషన్ రూమ్‌ను బయటకు వచ్చిన జెస్సీ.. గయ్స్.. నేను ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను అని చెప్పగానే షణ్ముఖ్ షాక్ తిన్నాడు. నమ్మలేని నిజాన్ని వింటున్నట్టు ముఖంలో బాధ కనిపించింది. ముఖ్యంగా జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్‌ సిరి, షణ్నుక్‌ కన్నీటి పర్యంతం అయ్యారు. నీవు ఫైటర్‌వు. నీవు స్ట్రాంగ్‌గా ఉండాలి అంటూ మనోధైర్యాన్ని యాంకర్ రవి నింపే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా కాసేపటి క్రితమే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అప్పటి వరకు ఆనందంలో ఉన్న ఇంటి సభ్యులందరూ జెస్సీ అర్ధాంతరంగా షో నుంచి వెళ్లిపోవడంతో బాధలో మునిగిపోయారు. అయితే ట్రీట్‌మెంట్ తీసుకొని జెస్సీ మళ్లీ వస్తాడా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే.