సైదాబాద్ ఘటన : బాధిత కుటుంబం ఇంటి ముందు షర్మిల దీక్ష

సైదాబాద్ ఘటన : బాధిత కుటుంబం ఇంటి ముందు షర్మిల దీక్ష

సైదాబాద్​లో అత్యాచారానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను వైఎస్​ షర్మిల పరామర్శించారు. సింగ‌రేణి కాల‌నీలో ఇటీవ‌ల 6 ఏళ్ల చిన్నారి చైత్ర ను ఓ యువకుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేయ‌డంతోపాటు హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై యావ‌త్ ప్రజానీకం భ‌గ్గుమంటోంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌జా సంఘాలు, మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించగా..బుధువారం షర్మిల పరామర్శించారు.

బాధతో కుంగిపోతున్న చిన్నారి తల్లిదండ్రులను షర్మిల ఓదార్చారు. ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పారు. తాము అందరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా… నిందితున్ని పట్టుకోకపోవటంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరితగతిన నిందితున్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. ఈ ఘటన ఫై కేసీఆర్ స్పందించే వరకు ఇక్కడ నుండి కదిలేదిలేదని షర్మిల కూర్చున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మరికాసేపట్లో సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు.