నారాయణ బెయిల్ రద్దుఫై హైకోర్టు మెట్లు ఎక్కబోతున్న ఏపీ సర్కార్

ap-ex-minister-narayana

టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం లో మాజీ మంత్రి , తెలుగుదేశం నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ ఫై బయటకు రావడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే నారాయ‌ణ‌కు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ర‌ద్దు చేయించే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రేపు నారాయణ బెయిల్ రద్దుపై ఏపీ హైకోర్ట్ లో లంచ్ మోహన్ మూవ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలువురు న్యాయ నిపుణులు, అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రేపు తెలుస్తుంది.

ఇక నారాయణ అరెస్ట్ విషయానికి వస్తే ..మంగళవారం నారాయణను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి , చిత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు , ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా, పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు.

దీంతో ఆ వాదనలు విన్న న్యాయమూర్తి ఏకీభవించారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు తెలిపారు.