ఏప్రిల్ 1న విద్యార్థులతో ప్రధాని మోడీ “పరీక్షా పే చర్చా ”

ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలనే విషయంపై సూచనలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 1, 2022న దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ( “పరీక్షా పే చర్చా ”) సంభాషించనున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మోడీ మోడీతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం, కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్‌లో ఈ ఈవెంట్ వర్చువల్ మోడ్‌లో నిర్వహించారు. మోడీతో ఈ చర్చలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులు innovateindia.mygov.inలో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే విషయంపై అభిప్రాయాలను వెల్లడించనున్నారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ సంవత్సరం త్వరలో పరీక్షల సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్ ప్రశాంతంగా , రిలాక్స్‌గా ఎలా ఉండాలో ప్రధాని మోడీ విద్యార్థులకు పలు సూచనలు చేయనున్నారు. పరీక్షల కోసం ఎలా సిద్ధమవ్వాలి అనే విషయంపై ప్రధాన మంత్రి విద్యార్థులతో సంభాషించనున్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడిగే పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిస్తారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/