కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు – వివేక్

,

తెలంగాణ లో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని.. అందుకే బీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపుతుండని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దసరా పర్వదినాన టిఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై టిఆర్ఎస్ ‘బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి )’ గా మారింది. కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీపై రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కేసీఆర్ బీఆర్ఎస్ పురాతన ఫై స్పందించారు.

చిగురుమామిడి మండల కేంద్రంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి జయంతి వేడుకలు జరిగాయి. దివంగత కాకా వెంకటస్వామి చిత్ర పటానికి ఫౌండేషన్ నేతలు లింగమూర్తి, కిష్టయ్య, సదానందం, ఇతర అంబేద్కర్ సంఘం నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని.. అందుకే బీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపుతుండని వివేక్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఖేల్ ఖతం అయిందని.. బీఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టిండని ఆయన పేర్కొన్నారు.