పీఎఫ్​ఐను రద్దు​ చేసిన కేంద్రం

ఉగ్ర కార్యకలాపాలకు నిధుల సమీకరణతో పాటు భారత్ లో మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్​ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. 7 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్లు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.