ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గాయి

హీరో, బజాజ్‌, టీవీఎస్‌ కంపెనీలు చెందిన వాహనాలు అందులో ఉన్నాయి

two wheeler sales decline
two wheeler sales decline

న్యూఢిల్లీ: దేశీయంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు మరోసారి తగ్గాయి. 2019 డిసెంబర్‌ నెలలో దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలూ విక్రయాలు తగ్గినట్లు ప్రకటించాయి. హీరో, బజాజ్‌, టీవీఎస్‌ కంపెనీలు అందులో ఉన్నాయి. సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాత్రమే అమ్మకాలు స్వల్పంగా పెరిగినట్లు పేర్కొంది. హీరో మోటో కార్ప్‌ డిసెంబర్‌ నెలలో 4,12,009 వాహనాలు విక్రయించింది. 2018 డిసెంబర్‌లో ఆ కంపెనీ 4,36,591 యూనిట్లు అమ్మకాలు చేపట్టింది. గతేడాదితో పోల్చినప్పుడు అమ్మకాల్లో 5.6 శాతం తగ్గుదల కనిపించింది. బజాజ్‌ ఆటో విక్రయాలు ఏకంగా 21 శాతం తగ్గాయి. గతేడాది 1,57,252 యూనిట్లు విక్రయించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది 1,24,125 యూనిట్లు విక్రయించింది. టీవీఎస్‌ అమ్మకాలు సైతం 25 శాతం మేర తగ్గాయి. గత నెల 1,57,244 యూనిట్లు విక్రయించిన ఆ కంపెనీ గతేడాది ఇదే సమయంలో 2,09,906 యూనిట్లు అమ్మింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సైతం ఈ ఏడాది డిసెంబర్‌లో 48,489 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది 56,026 యూనిట్లు విక్రయించింది. అమ్మకాలు 13శాతం పడిపోయాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/